Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం దారూర్ మండల కేంద్రంలో హత్ సే హత్ యాత్ర నిర్వహించారు. గడపగడపకూ తిరుగుతూ కాంగ్రెస్ చేసే అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఈ కార్య క్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, మాజీ జడ్పీటీసీ రాము లు, అధ్యక్షులు విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.