Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
విద్యార్థుల శక్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకే పర్వతారోహణ అని జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని కళాశాల వసతి గృహ వంద మంది విద్యార్థులను పర్వతారోహణ శిక్షణా కార్యక్రమం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా లోని భువనగిరి ఖిల్లాకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రెండు రోజుల పర్వతారోహణ శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. మొదటి రోజు పర్వతారోహణ చేయడానికి విద్యార్థులు కొద్దిగా భయాందో ళనకు గురికావడం జరిగినప్పటికీ, రెండవ రోజు ప్రతి విద్యార్థి పర్వతారోహణను అవలీలగా ఎక్కినట్టు తెలిపారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు పౌష్టికరమైన ఆహారం వసతి కల్పించినట్టు తెలిపారు. గతంలో కూడా ప్రిన్సిపాల్ సెక్రటరీ విద్యార్థులకు వారిలోని నైపుణ్యాన్ని వెలి కి తీయడానికి అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. విద్యార్థుల శక్తి సామర్ధ్యాలు వెలికి తీయడానికి అనుకూలంగా ఉందన్నారు. ఈ కార్యక్రమా లను చేపట్టినందుకు వసతి గృహ సంక్షేమ అధికారులు వెనుకబడిన తరగతుల సెక్రటరీ, కమిషనర్ బుర్రా వెంకటేశంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.