Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
- కేశంపేట్ ఎంపీపీ రవియాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
దైవచింతనతో మెలిగి ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని కేశంపేట్ ఎంపీపీ రవియాదవ్ అన్నారు. ఆదివారం కొత్తూరు మండల పరిధిలోని గూడూ రులో బొడ్రాయి పండుగ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు వారి మత, ఆచారాలకు అనుగుణంగా దైవ చింతనతో మెలిగి ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని అన్నారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామంలో బొడ్రాయి ఏర్పాటు చేసి గ్రామ స్తులు కలిసికట్టుగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం రవియాదవ్‌ను ఆలయ కమిటీ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం బొడ్రా యి ఉత్సవాలకు హాజరైన వారికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ ఈటా గణేష్, ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, బాతుక దేవేందర్యా దవ్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ డోలి రవీందర్, బీఆర్ఎస్ కొత్తూరు మండల శాఖ అధ్యక్షుడు మెండే కృష్ణయాదవ్, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేందర్‌గౌడ్, సర్పంచులు బ్యాగరి సత్తయ్య, రవినాయక్, ఉప సర్పంచ్ దయానంద్ గుప్తా, చేగుర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ మున్నూరు పద్మారావు, బీఆర్ఎస్ నాయకులు మామిళ్లపల్లి విఠల్, రవినాయక్, మేకల రాఘవేం దర్యాదవ్, బండి శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.
బొడ్రాయికి బోనాలను
సమర్పించిన మహిళలు...
గూడూరు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టవద్ద మహి ళలు బోనాలు సమర్పించేందుకు భారీ ఎత్తున బయలు దేరారు. బోనాల ముందు డప్పుల దరువులు, పోతురాజుల విన్యాసాలు, లయబద్ధంగా యువత నృత్యాలతో గూడూరు గ్రామం దద్దరిల్లింది. గ్రామంలోని మహిళలు తలపై బోనాలు పెట్టుకొని గ్రామ కూడలిలోని బొడ్రాయి వద్దకు చేరుకొని నైవేధ్యాలు సమర్పించారు. గ్రామంలో ఎక్కడ చూసిన పచ్చని తోరణాలతో కళకళలాడింది.