Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెట్లు నరికి మట్టి పోసిన
- కొత్త పెట్రోల్ బంక్ నిర్వాకుడు
- చౌదర్పల్లి గేటు దగ్గర సంఘటన
నవతెలంగాణ-యాచారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరి తహారం కింద నాటిన మొక్కలను కొత్త పెట్రోల్ బంక్ నిర్వాహకుడు నరికి మట్టి పోశాడు. ఈ సంఘటన యాచా రం మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలో జరిగింది. చౌదర్పల్లి గేటు దగ్గర కొత్త పె ట్రోల్ బంక్ పేరుతో మరమ్మతులు చేస్తున్న నిర్వాహకులు హరితహారం కింద నాటిన చెట్లను గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా నరికాడు. అంతటితో ఆగకుండా అవి కనబడకుండా మట్టితో నింపేశాడు. దాంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిం చారు. ఈ విషయంపై వివరణ కోరగా తమకు సమాచా రం లేదని గ్రామపంచాయతీ పాలకవర్గం తెలిపింది. బా ధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.