Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీపీఓ తరుణ్ కుమార్
నవతెలంగాణ-కుల్కచర్ల
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీపీఓ తరుణ్ కు మార్ హెచ్చరించారు. శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని కామ న్పల్లిలో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. గ్రామ పంచాయతీ లోని రికార్డులను పరిశీలించి రికార్డు నిర్వ హణలో జాప్యం చేస్తున్న పంచాయతీ కార్యదర్శి పై ఆగ్ర హం వ్యక్తం చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని సర్పంచ్ మైపాల్ రెడ్డికి సూచించారు. అనంతరం గ్రామంలో ఉన్న నర్సరీ, పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డ్, క్రిమిటోరియంను సంద ర్శించారు. నర్సరీలో మొక్కలు ఏపుగా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువగా మొక్కలు పెంచి హరితహా రం నాటికి అందించాలన్నారు. పల్లె ప్రకృతి వనంలో పం డ్లు, పువ్వులు తదితర వాటిని నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న క్రిమిటోరియంను త్వరగా పూర్తిచేసి వాడుకలోకి తీసుకురావాలన్నారు. డం పింగ్ యార్డ్లో తడి, పొడి చెత్తను వేరుగా చేసి ఉంచాల న్నారు. డంపింగ్ యాడలో ఎరువులను తయారు చేసి వా టిని వినియోగించాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని లేదంటే చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీఓ కరీం, కుల్కచర్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కాముని పల్లి పంచాయతీ కార్యదర్శి సుమలత, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.