Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
పీఆర్టీయూ టీఎస్ అధికార ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చె న్నకేశవరెడ్డికీ దోమ మండలంలోని మార్చి 13న జరిగే హై దరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలి పిం చాలని పీఆర్టీయూ మండలాధ్యక్షులు ఆర్. కేశవులు అధ్య క్షతన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నకేశ వరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పక్షపాతి, సమస్యలు, జీవోల పట్ల అవగాహనున్న ఎమ్మెల్సీ అధికార అభ్యర్థి గుర్రం చెన్న కేశవరెడ్డి సీరియల్ నెంబర్ 11 పక్కన 'మీ మొదటి ప్రాధా న్యత ఓటు వేసి గెలిపించాలి' అని కోరారు. ఎమ్మెల్సీ ఎన్ని కల్లో పీఆర్టీయూ సంఘానికి 29 ఉపాధ్యాయ క్యాడర్ వారి సంఘాలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. సాధారణ ఎలక్షన్స్ కంటే ముందుగానే సీపీఎస్‌పై ప్రభుత్వాన్ని ఒప్పిం చేలా చర్యలు పీఆర్సీ సాధన, హెల్త్ స్కీం అమలు, కోర్టు స్టే ద్వారా ఆగిన ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్, పండిట్, పీఈటీ క్రమబద్ధీకరణ, పీఎస్ హెచ్ఎం అమలు పారదర్శకంగా జరిగేలా రాష్ట్ర సంఘం పూర్తి బాధ్యత వహిస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కె.ప్ర భాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య, వెంకట్‌చారి, ప్రవీణ్ సింగ్, జై రామ్, చక్రవర్తి, లక్ష్మణ్ తదితరలున్నారు.