Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంతింటి కలను నెరవేర్చుకోండి
- జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
అన్ని సదుపాయాలున్న గృహాలను కొనుగోలు చేసేం దుకు ఆలస్యం ఎందుకని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం తాండూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవ రణలో తాండూర్ నియోజకవర్గ ప్రజలతో ఆర్డీఓ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 17, 18వ తేదీల్లో కోకట్ గ్రామపంచాయతీ శివారులోని రాజు సగృహ మనోహర టౌన్ షిప్లో ఉన్న 54 గృహాలు 14 ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం వెయ్యనున్నట్లు తెలిపారు. అప్రూవ్ లేఅవుట్, అన్ని సదుపాయాలతో ఎలాంటి సమ స్యలూ లేని వీటికి వేలం వేస్తామన్నారు. మౌలిక సదుపా యాలైన తాగునీరు, డ్రయినేజీ, రోడ్లు, విద్యుత్తు లాంటి అ న్ని సదుపాయాలు సమకూరుస్తామన్నారు. గతంలో బహిరంగ వేలం నిర్వహించి విక్రయించిన తర్వాత మిగిలి పోయిన ప్లాట్లను, గృహాలను మరొకసారి బహిరంగవేలం నిర్వహించి విక్రయింస్తామన్నారు. వేలం పాటలో అత్యధిక పాట పాడి ప్లాట్లను దక్కించుకునే వారు మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లించిన వారికి 2 శాతం సబ్సిడీ అందింస్తామని 90 రోజుల్లో 3 విడతలుగా చెల్లించవచ్చని తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు రూ.10 వేలు డీడీని అందజే యాలన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ నివృత్తి చేశారు. అంతారం నుండి గౌతాపూర్ వరకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణపు పనులను కలెక్టర్ పరిశీలించారు. దీంతోపాటు. స్థానిక ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాల యాలను తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సం దర్శించి బాగుందని ప్రశంసించారు. కార్యాలయంలో ధర ణి ఫిర్యాదుల రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలించారు. కార్య క్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డిఓ అశోక్ కుమార్, తహాసీల్దార్ చిన్నపల నాయుడు, ఎంపీడీవో సుదర్శన్ రెడ్డి ప్రజా ప్రతినిధులు వ్యాపార వేత్తలు తదితరులు పాల్గొన్నారు.