Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైపాస్ రోడ్డు పనులు, రాజీవ్ స్వగృహ గృహాలు, ప్లాట్లను పరిశీలన
- 17, 18 తేదీల్లో రాజీవ్ స్వగృహ గృహాల ప్లాట్ల వేలంపాట
- కలెక్టర్ నారాయణ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తాండూరులో వికారాబాద్ జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. తాండూర్‌లో జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను పరిశీలించారు. రాజీవ్ స్వగృహ గృహాలు ప్లాట్ల ను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతారం నుండి గౌతాపూర్ వరకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణపు పను లనూ పరిశీలించారు. నియోజకవర్గంలోని యాలాల్ మం డలం, కొకట్ గ్రామ పరిధిలోని మనోహర టౌన్ షిప్‌లోని రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లు, గృహాలకు ఈనెల 17,18 తేదీల్లో బహిరంగ వేలం వెయ్యనున్నట్టు కలెక్టర్ సి.నారా యణ రెడ్డి తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిం చిన ఫ్రీ బిడ్డింగ్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అప్రూవ్డ్ లేఅవుట్, అన్ని సదుపాయాలతో ఎలాంటి సమ స్యలూ లేని 54 గృహాలు, 14 ఓపెన్ ప్లాట్లకు ఈనెల 17, 18 తేదీల్లో బహిరంగ వేలం వేయనున్నట్లు కలెక్టర్ తెలి పారు. మౌలిక సదుపాయాలైన తాగునీరు, డ్రయినేజీ, రోడ్లు, విద్యుత్ లాంటి అన్ని సదుపాయాలు సమకూరుస్తా మన్నారు. 100 గజాల నుండి 250 గజాల విస్తీర్ణమున్న ప్లాట్లను మధ్యతరగతి వారికి ఉపయోగపడే విధంగా ఉం టాయన్నారు. గతంలో బహిరంగ వేలం నిర్వహించి విక్ర యించిన తర్వాత మిగిలిపోయిన ప్లాట్లను, గృహాలను మ రొకసారి బహిరంగవేలం నిర్వహించి విక్రయిస్తామన్నారు. వేలం పాటలో అత్యధిక పాట పాడి ప్లాట్లను దక్కించుకునే వారు మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లించిన వారికి 2 శాతం సబ్సిడీ అందిస్తామన్నారు. 90 రోజులలో 3 విడతలుగా చెల్లించవచ్చని తెలిపారు. పలువురు అడిగిన ప్రశ్నలకు కల ెక్టర్ నివృత్తి చేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయా లను కలెక్టర్ తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి బాగుందని ప్రశంసించారు. కార్యాలయంలో ధరణి ఫిర్యాదుల రిజిస్టర్‌ను కలెక్టర్ పరిశీలించారు. కార్య క్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డిఓ అశోక్ కుమార్, తహాసీల్దార్ చిన్నపల నాయుడు, ఎంపీడీ వో సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.