Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ శేర్లింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ
నవతెలంగాణ-మియాపూర్
ఉన్నత అధికారుల కోసం కిందిస్థాయి సిబ్బందిని బలి చేయొద్దని సీఐటీయూ శేర్లింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ అన్నారు. శనివారం గచ్చిబౌలి డివిజన్లో ఏడీ ఆఫీస్ ఎదుట తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గచ్చిబౌలి డివిజనల్ ఇంజనీర్ గోపాలకృష్ణ అవినీతికి పాల్పడుతున్నాడని అన్నారు. అక్రమంగా అతనికి సంబం ధం లేని వింగ్ లైన్స్ నుంచి కార్మికులను బదిలీ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించా రు. గతేడాది జరిగిన బదిలీల్లో ఆపరేషన్‌లో ఉన్నటువంటి కార్మికులను బదిలీ చేయడమే కాకుండా లైన్స్‌లో ఉన్నటు వంటి కార్మికులను లైన్స్ డీఈకి సంబంధం లేకుండా తనకు ఇష్టం వచ్చినట్టు తన ఇష్టానుసారం బదిలీలను చేశాడని తెలిపారు. సీఐటీయూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ఆఫీస్ బేరర్ ఎస్.రవీందర్ మాట్లాడు తూ కార్మికులకు అన్యాయం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా నిర్మించిన సబ్ స్టేషన ్లోకి టెక్నికల్‌గా ఐటిఐ కూడా లేని నాన్ టెక్నికల్ గ్రేడ్ 3 ఆర్టిజన్ని సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా నియమించడం ఎంతవ రకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అలాగే ఆర్టిజన్ ప్రొబేషన్ పిరియడ్ డిక్లియర్ చేస్తూ సీనియార్టీ లిస్టు రిలీజ్ చేస్తూ ప్రమోషన్ కల్పించి గ్రేడ్ 2 ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కమిటీ మెంబర్ రాజే శ్వర్, సైబర్ సిటీ అధ్యక్షులు వేణుయాదవ్, సైబర్ సిటీ కార్యదర్శి భూతరాజు, లెనిన్ పాల్గొన్నారు.