Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి కుటుంబ సభ్యుల ఆరోపణ
- అదేమీ లేదంటున్న కేశవరెడ్డి పాఠశాల యాజమాన్యం
- బాలుడి మృతిపై పూర్తి విచారణ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
- పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
నవతెలంగాణ- వికారాబాద్ డెస్క్
కేశవరెడ్డి పాఠశాల నిర్లక్ష్యం వలన ఓ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సమీపంలో గల కేశవరెడ్డి పాఠశాలలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెంగములు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిన్నమంగళవారం గ్రామానికి చెందిన కే.కార్తీక్ (9) మూడవ తరగతి చదువుతున్నాడు. గత నెల 26 తేదీన కార్తీక్ మధ్య రాత్రిలో తన పడుకున్న బెడ్‌పై నుండి కింద పడడంతో ఎడమ భుజానికి తీవ్ర గాయం అయింది. ఆరోజు రాత్రి అలాగే పడుకొని ఉదయం పాఠశాల సిబ్బందికి బెడ్ పైనుంచి కింద పడిన విషయం చెప్పడంతో అక్కడే ఉన్న ఏఎన్ఎంతో ప్రథమ చికిత్స నిర్వహించారు. బాలుడు నీరసంగా ఉండడంతో బాలుడు అస్వస్థకు గురయ్యాడు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గత నెల 27వ తేదీ సాయంత్రం కుటుంబ సభ్యులు వచ్చి కార్తీక్‌ను హాస్పిటల్ కి చూపిస్తామని ఇంటికి తీసుకెళ్లారు. మరునాడు నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చూపెట్టగా బాలుడి ఎడమభుజం లో ఇన్ఫెక్షన్ అయ్యిందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు అంగీకరించడంతో శనివారం ఉదయం చికిత్స అందించారు. ఈ క్రమంలోనే బాలుడి పరిస్థితి విషమించి మృతిచెందాడు. పాఠశాలలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని బాలుడి కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో పాఠశాలకు వెళ్లారు. జరిగిన సంఘటనను విద్యార్థులను, పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేస్తే పా ఠశాలపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలి పారు. విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న విద్యా ర్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళన చేశా రు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి మతికి కారణమైన పాఠశాలపై చర్యలు తీసుకోవాలి : ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు పి.సతీష్ రెడ్డి
విద్యార్థి మృతికి కారణమైన కేశవ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల యాజమా న్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు పి.సతీష్‌రెడ్డి, వివిధ సంఘాల విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. కేశవరెడ్డి పాఠశాలలో గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయని తెలిపారు. యాజమాన్యం, అధికారులు కుమ్మక్కై బయటికి రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో 30 మంది విద్యార్థులకు అస్వస్థకు గురైన ఒకరు కూడా బయటికి చెప్పలేరని అన్నారు. విద్యా ర్థి కార్తీక్ అస్వస్థకు గురైన కూడా పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు స్పందించి విద్యార్థి మృతిపై పూర్తి విచారణ జరిపించి బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటాం : జిల్లా విద్యాధికారి రేణుక దేవి
విద్యార్థి మృతిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నా మని జిల్లా విద్యాధికారి రేణుకదేవి తెలిపారు. గతంలో కూడా కేశవరెడ్డి పాఠశాలను సందర్శించిన సందర్భంలో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని పాఠ శాల యాజమాన్యానికి సూచించినట్టు తెలిపారు. విద్యార్థి మృతిపై పూర్తి విచారణ చేసి బాధ్యులు అయితే కేశవరెడ్డి పాఠశాలపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.