Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో పరిష్కారం
- బీజేపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి డాక్టర్ ప్రేమ్‌రాజ్
నవతెలంగాణ-శంషాబాద్
నాటి కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేలో విస్తరణలో భాగంగా 2001- 2003లో రూపొందిం చిన ఎన్‌హెచ్ కారిడార్ కారణంగానే శంషాబాద్‌లో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నాయని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి డాక్టర్ ప్రేమ్‌రాజ్ అన్నారు. శంషాబాద్ నేషనల్ హైవే విస్తరణలో జరుగుతున్న లోపాలు కాం ట్రాక్టర్, అధికారులు నిర్లక్ష్య పనుల గురించి ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిలో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు ముఖ ద్వారం వరకు 4 లైన్లుగా ఉన్న ఎన్ హెచ్ 44ను, 6 లైన్లుగా మార్చడానికి పూర్తి నిధులను మంజూరు చేసిందన్నారు. ఇందులో భాగంగా ఫ్లైఓవర్లతో పాటు శంషాబాద్ దగ్గర మల్లిక గార్డెన్ నుం చి ఎయిర్పోర్ట్ ముఖద్వారం వరకు రెండు కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మించాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్‌కు ఉన్న వెసులుబాటు, రాజకీయ జోక్యం, కాంట్రాక్టర్ అవినీతి జాతీయ రహదారి అధికారుల నిద్ర మత్తుతో లోప భూ యిష్టంగా నిర్మాణం సాగింద న్నారు. 16 కిలోమీటర్ వద్ద ప్రారంభం కావాల్సిన ఎలివేటెడ్ అత్యంత రద్దీగా ఉండే 17 కిలోమీటర్ వద్ద ఫ్లైఓవర్ ప్రారంభించారు. ఇక్కడే వివిధ వర్గాలకు చెందిన ప్రార్థన మందిరాలు ఉన్నాయనీ తెలిపారు. కాంట్రాక్టర్ అవినీతి, అధికా రుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం కావడం తోపాటు ప్రజలకు సైతం తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. 17 కిలోమీటర్ వద్దనే కూరగాయల మార్కెట్ రైతులు, వినియోగదారులు, ,రైల్వే ప్రయాణిక ులు, స్కూల్ విద్యార్థులు రోడ్డును దాటుటకు తీవ్ర ఇబ్బంది కలగడంతో పాటు రోడ్డు ప్రమాదంలో ఎంతోమంది ప్రాణా లను కోల్పోయారనీ అన్నారు. గత నెలలో స్థానికులు తీవ్ర ఆందోళన చేయడంతో స్థానిక ఎంపీ రంజిత్ రెడ్డి కలగజేసుకొని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఫ్లైఓవర్ పొడి గించాలి లేదా మరో ఫ్లైఓవర్ నిర్మించాలని విన్నవించారని తెలిపారు. ఇదే విషయాన్ని తను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కేం ద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి ఈ విషయంపై వెంటనే స్పందించాలంటూ రోడ్లు , జాతీయ రహదారి మంత్రిత్వ శాఖతోపాటు అధికారులకు నివేదించారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో నేషనల్ హైవే విస్తరణ సమస్య పరిష్కారం కానందుని తెలిపారు.