Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చెన్నయ్య
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
స్థానికత కోల్పోయిన వారిని సొంత జిల్లాలకు తెచ్చే బాధ్యత తమ సంఘం తీసుకుంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనార్ధన్‌రెడ్డిని గెలిపించాలని పీఆర్టీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెన్నయ్య కోరారు. శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా యాలాల, బషీరాబాద్ మండలాల్లోని పలు పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 317 జీవో వలన జిల్లా కోల్పోయిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు స్థానిక జిల్లాకు తీసుకుపోయే బాధ్యత తమదే అన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేస్తామ న్నారు. పండిట్, వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా న్యాయం చేస్తామ న్నారు. ఈ వేసవిలో బదిలీలు, పదోన్నతులు జరుగుతాయని ఆయన చెప్పా రు. ఈ కార్యక్రమములో పీఆర్టీయూ తెలంగాణ వికారాబాద్ జిల్లా అధ్యక్షు డు మొగుడంపల్లి విజయ శ్రావణ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మల్లే శం, వికారాబాద్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ ఉపేందర్‌రెడ్డి, రంగారెడ్డి ఉపాధ్యక్షులు వెంకటయ్య, సంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి సంఘమేశ్వ ర్‌రెడ్డి, జిల్లా నాయకులు మహేందర్‌రెడ్డి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.