Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్‌నగర్
శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి నాగుల సాత్విక్ ఆత్మహ త్యపై అధికారుల నివేదికలో నిజాలు దాస్తున్నారా? అనే అనుమానాలకు తావిస్తోంది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యా ధికారి ఇచ్చిన రిపోర్ట్ కళాశాల యాజమాన్యం వేధింపులను తాలలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ నోట్ లో సైతం వెల్లడైంది. కానీ కళాశాల యాజమాన్యం ఆడిస్తు న్న ఆటలో అధికారులు భాగస్వామ్యం అవుతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాస్థాయి అధికారులు ప్రభుత్వానికి ఇస్తున్న నివేదికలో ఇచ్చిన తప్పుడు రిపోర్టర్ ఇందుకు సాక్షాత్కారం. యాజమాన్యం తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు సాత్విక్ తమ కళాశాలలో అడ్మిషన్ లేదని మరో అనుబంధ కళాశాలలో చేరాడని వార్షిక ఫీజు సైతం మరొక కళాశాల కోడ్‌తో ఉందని, సాత్విక్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో ఉంచామనడం వెనుక నిజా నిజాలు కప్పి పుచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని తల్లిదండ్రులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం విద్యా ర్థులను వేధింపులతో తీవ్ర ఒత్తిడితో విద్యను అందించడం వల్లే తమ బిడ్డ ఆత్మహత్యకు దారి తీసిందని, అధికార యంత్రాంగం వాటిని నిరోధించాలని విద్యార్థులకు ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందిం చాలని ర్యాంకుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయడం మా నసిక ప్రశాంతతను కోల్పోయేలా చేయడం ఇకపై జరగ కూడదని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.