Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గుల
మండలంలోని ఆర్కపల్లి శ్రీ కాశీవిశ్వేశ్వర వీరాంజనే య స్వామి ఆలయంలో ఆదివారం హుండీ లెక్కింపు కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాత్రి బ్ర హ్మౌత్సవాల్లో భాగంగా భక్తుల నుంచి ఆలయ హుండీకి రూ.14వేల 515 ఆదాయం సమకూరగా, శివరాత్రి బ్ర హ్మౌత్సవాలకు దాతలు, భక్తుల నుండి రూ.5 లక్షల 20 వేల 775 ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ స భ్యులు తెలిపారు. శివరాత్రి బ్రహ్మౌత్సవాలకు రూ.6 లక్షల 10 వేల ఖర్చు కాగా ఆలయ మూలధనం రూ. 3 లక్షల ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కో ఆప్షన్ సభ్యులు ఆకుతోట నర్సింహ్మ గుప్త తన సొంత అవసరాల నిమిత్తం ఆలయకమిటి అనుమతితో తీసుకున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో సర్పంచ్ ఏర్పుల జంగయ్య, ఉపసర్పంచ్ యాచా రం బిక్కుగౌడ్, మాజీ సర్పంచ్ ఏపీ. జంగయ్య గుప్త, ఆల య కమిటీ సభ్యులు ఆకుతోట నర్సింహ్మ గుప్త, సిరుస వాడ శ్రీనివాస్ ప్రజాపతి (దేవుడి శ్రీను) సిరుసవాడ చంద్ర శేఖర్ ప్రజాపతి, దండు తిరుపతయ్య గౌడ్, ఆకుతోట జగ న్మోహన్ గుప్త, కల్లు రాజశేఖర్ రెడ్డి, దండు సురేష్‌గౌడ్, యాచారం కాటంగౌడ్, సిరుసవాడ పాండు ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.