Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ల నరసింహ మాదిగ
- మాల్ కేంద్రంలో మాదిగల సంగ్రామ పాదయాత్ర ప్రారంభం
నవతెలంగాణ-యాచారం
ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించా లని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ల నరసింహ మా దిగ డిమాండ్ చేశారు. ఆదివారం యాచారం మండల పరి ధిలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాల్ కేంద్రంలో మాదిగల సంగ్రామ పాదయాత్ర ప్రారంభించా రు. నియోజకవర్గ వ్యాప్తంగా సమన్వయకర్త కాళ్ల పాండు జండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లో వర్గీకరణ తీసుకొస్తా మని చెప్పి మాదిగలను మోసం చేసిందని మండిపడ్డారు. 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై మౌనం వీడాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇప్ప టికైనా నిర్లక్ష్యాన్ని విడనాడాలని మాదిగలంతా కోరుతు న్నారని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 4న హైదరాబాదులో పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడ రేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగలు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్సీ యాచారం మండల అధ్యక్షుడు కొమ్ము మహేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి మూళి మహేష్ మాదిగ, అధికార ప్రతి నిధి మహేష్ మాదిగ, మంద లింగం, కందికంటి ఆనంద్, సిద్దాపురం శ్రీకాంత్, ఎమ్మెస్ ఎఫ్ ఓయూ నాయకులు ఆదిత్య, ప్రవీణ్, యాదయ్య, చంద్రకాంత్, విక్రమ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.