Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్
నవతెలంగాణ-మియాపూర్
మార్క్సిస్టు మహౌపాధ్యాయులు కామ్రెడ్ స్టాలిన్ 70వ వర్థంతి కార్యక్రమం స్టాలిన్‌నగర్‌లో ఘనంగా జరి గింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఎం సీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ స్టాలిన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ పేద ధనికవర్గం, వర్ణం, కులం, లాంటి అం తరాలు లేని సమాజ నిర్మాణం సోషలిజాన్ని స్థాపించిన మార్క్సిస్టు మహౌపాధ్యాయుడు కామ్రెడ్ స్టాలిన్ అని అన్నారు. సామ్రాజ్యవాదానికి సామ్రాజ్యవాదానికి పెట్టు బడి దారి ఆర్థిక విధానానికి ఆనాడు రష్యాలో కామ్రెడ్ లెని న్‌తో కలిసి సోషలిస్టు వ్యవస్థ స్థాపన కోసం పోరాడినారని ఫలితంగా లెనిన్ నాయకత్వన స్థాపించబడిన సోవిటి యూనియన్ను ప్రపంచంలోని ఆధిపత్య ఫాసిస్టు నియంతృత్వ శక్తులను ఎదిరించి కమ్యూనిస్టు పా ర్టీ నేతృతంలో సోషలిజాన్ని నిలబెట్టారన్నారు. మరో పక్క జర్మనీ నియంత హిట్లర్ నియంతృ త్వాన్ని తిప్పిగొడుతూ రెండో ప్రపంచ యుద్ధాన్ని రష్యా సేనాలతో నిలబెట్టి యుద్ధాలు వద్దు ప్రపం చశాంతి ముద్దని ప్రపంచానికి సాటి చెప్పారని కొనియాడారు. కామ్రేడ్ స్టాలిన్ దేశంలో సోష లిజం సాధన కోసం 1951లో భారత విప్లవ సా రథులకు విధివిధాలను ఇస్తూ దేశంలో సోషలిస్టు సాధనకు చేసిన సూచనలను నేటికీ ఎంసీపీఐ(యూ) కట్టు బడి పని చేస్తుందని సోషలిస్టు ప్రధాత స్టాలిన్ సూచన దిశగా దేశంలో వర్గ, సామాజిక పోరాట జలీమితో దేశంలో సోషలిజం సాధించబడుతుందన్నారు. భారత పాలకవ ర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల నిర్వహిస్తూ పెట్టు బడిదారి ఆర్థిక విధానాలకు, అవినీతికి, కుల-మతా లకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఎంసీ పీఐ(యూ) పో రాటంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగి సోష లిస్టు స్థాపన దిశగా స్టాలిన్ ఆశయాలతో ముందుకు సాగా లని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యంసీ పీఐ (యూ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.భాగ్యమ్మ, మియా పూర్ డివి జన్ కమిటీ సభ్యులు ఎం.రాణి, దారలక్ష్మి, స్టాలిన్నగర్ సభ్యులు వనంరాధ, ఈశ్వరమ్మ, కే మాధవ, ఎన్ నాగ భూ షణం, ఏ.శంకర్, డి.శ్రీనివాసులు, టి.నర్సింగ్, కే. షరీష్, సి.హెచ్.శీను, చంద్రమోహన్ రెడ్డి, రామయ్య, డి.నగేష్, రాములు పాల్గొన్నారు.