Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నవతెలంగాణ-మియాపూర్
ఆరోగ్యంపట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మియాపూర్ కార్పొ రటర్ శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనగర్ కాల నీలో మందాడి మగ్నుస్ అపార్ట్మెంట్స్ అసొషియన్ సభ్యులు, రామ్సుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో మెడికేర్, యశోద ఆస్పత్రుల్లో వారి సౌజ్యన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అసొషియన్ సభ్యులతో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేట్ ఆస్పత్రు సంస్థలు ఇలా పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించడం అభినంద నీ యం ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా మందులు, పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం పేద ప్రజలకు ఎంతగానో అవసర మన్నారు. భవిషత్తులో ఇలాంటి క్యాంపులు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మందాడి మగ్నుస్ అపార్ట్మెంట్స్ అసొషియన్ సభ్యులు, రామ్ సుబ్బారెడ్డిని అభినందిస్తూ, డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో కాలనీల అసొషియన్ సభ్యులు హాస్పిటల్స్ యాజమాన్యం వా రి సహకారంతో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో మెడికేర్, యశోద హా స్పిటల్స్ డాక్టర్స్ సిబ్బంది, మందాడి మగ్నుస్ అపార్ట్ మెంట్స్ అసొషియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.