Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి
- వంపుగూడ, చల్లంపల్లి గ్రామాల్లో 'హాత్ సే హాత్' జోడో యాత్ర
నవతెలంగాణ-ఆమనగల్
కాంగ్రెస్తోనే సుస్థిర సంక్షేమ పాలన సాధ్యమవుతుం దని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చల్లా వంశీ చంద్ రెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగింపులో భాగంగా కడ్తాల్ మండలంలో కాంగ్రెస్ శ్రేణులు చేపడు తున్న 'హాత్ సే హాత్' జోడో యాత్ర ఆదివారం వంపుగూ డ, చల్లంపల్లి గ్రామాలలో కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ నియం త పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి అరా చక పాలనతో విరక్తి చెందిన ప్రజలు వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చె ప్పారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న జైపాల్ యాదవ్ సొంత గ్రామం చల్లంపల్లి ఎలాంటి అభివృద్ధికీ నోచుకో లేదన్నారు. రైతు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి తదితర హామీలను తుం గలో తొక్కిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతా రన్నారు. అదేవిధంగా నిత్యం సిలిండర్, పెట్రోల్, డీజిల్ తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తుం దని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రూ.500లకే సిలిండర్, అర్హులైన వారికి ఇళ్ళు కట్టుకోడానికి రూ.5 లక్ష లు అందజేస్తామని వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. యాత్ర లో భాగంగా గ్రామంలో ఉన్న అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవి ధంగా కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, మండల అధ్యక్షుడు బీచ్య నాయక్, సింగిల్ విం డో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేతావత్ హీరాసింగ్ నాయక్, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్ బాబా, సర్పంచ్ బావోజీ, టౌన్ అధ్యక్షులు తిరు పతి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నాయకులు గణేష్, శేఖర్, జంగ య్య, మల్లేష్, గురిగల్ల లక్ష్మయ్య, అశోక్, సుధాకర్, కృష్ణ య్య, శ్రీను, రామకృష్ణ, బాల్ రాజు, రాజేష్, శ్రీకాంత్, తుల సి రామ్, రవి, ఇమ్రాన్, రమేష్, నరేష్, మహేష్ తది తరులు పాల్గొన్నారు.