Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ కమిటీ ఛైర్మన్ విఠల్ నాయక్
- క్రీడాకారులకు మనోహర్ చేసిన సేవలు అభినందనీయం
- తైక్వొండో బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లను క్రీడాకారులకు ప్రదానం
నవతెలంగాణ-తాండూరు
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాయ సహకారాలతో తైక్వొండో శిక్షణకు ఎకరా భూమిని కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తామని మార్కెట్ కమిటీ ఛైర్మన్ విఠల్ నా యక్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని శివహై స్కూ ల్ ఆవరణలో తాండూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ విఠల్ నా యక్, పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి, తైక్వొండో రాష్ట్ర ఉపా ధ్యక్షులు మనోహర్, మాస్టర్ కుసాల్, సీనియర్ జర్నలిస్ట్ నర్సింహా, క్రీడాకారులకు తైక్వొండో బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఎస్ఐ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తైక్వొండో క్రీడా అత్మరక్షణకు, ఉద్యోగావకాశాల్లో ఎంతగ నో ఉపయోగపడుతుందని, క్రీడాకారులకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని వివరించారు. మాస్టర్ మనోహర్ చేసిన సేవలు అభినందనీయమన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్తో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసారన్నారు. 33 ఏండ్ల నుంచి తాండూర్లో తైక్వొండో క్రీడను క్రీడాకారులకు శిక్ష ణ ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. రానున్న రోజు ల్లో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిం చి ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, క్రీడ ల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రొత్సహించాలని కోరారు. తైక్వొండో బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లను పొందిన వారిలో సాయి రోహణ్రెడ్డి, శ్రీవార్ గౌతమ్, శ్రీ కౌసల్య, 50 మంది క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్లు అందజేశారు. క్రీడాకారులకు బెల్ట్లు, మెమెంటోలు ప్రదానంచేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ విఠల్ నాయక్, పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డిలను మాస్టర్లు మనోహర్, కుసాల్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోచ్లు బస్వరాజ్, వివేక్, శరత్, నొమాన్, నాగ సాయి, సొహెల్, మధుసూదన్ గౌడ్, క్రీడాకారుల తల్లితండ్రులు, తైక్వొండో క్రీడాకారులు పాల్గొన్నారు.