Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం జాతీయ కార్యదర్శి బి.బాలయ్య
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
మాలలు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని సంఘం జాతీయ కార్యదర్శి బి.బాలయ్య సూచించారు. నవాబుపేట మండలంలో అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో జరి గిన మాలల ఐక్యవేదిక సభలో ముఖ్య నాయకుల సమా వేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షలు పైన మాలలు ఉన్న ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులు దక్కడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా మాలలు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. అంబేద్కర్ వారసులుగా నిరూపిం చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బి. గాలయ్య మాట్లాడుతూ 25న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే మాల మహానాడు సదస్సుకు భారీ ఎత్తున మాల సైనికులం వెళ్లి సభను విజయవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి శివరాజు, మాల మహానాడు సభ్యులు పాల్గొన్నారు.