Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఏర్పాటు
నవతెలంగాణ-మీర్పేట్
కాలనీ అభివృద్ధి కోసం కాలనీల సంక్షేమ సంఘాలు, ప్రభుత్వం కలిసి సమిష్టిగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇం ద్రారెడ్డి అన్నారు. ఆదివారం మీర్పేట్ మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలోని దాదాపు 40 కాలనీల సంక్షేమ సంఘాలు కలిసి కాలనీల సంక్షేమ సంఘాల సమైక్యను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై మాట్లాడారు.. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాలు, కాలనీ వేల్ఫేర్ అసోసియే షన్స్ ఒక్కతాటిపైకి వచ్చి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడిగా ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తా నన్నారు. యూఎల్సీ సమస్య, అధిక ఉన్న ఇంటి పన్నులు, సర్వీస్ రోడ్ల నిర్మాణం, కుక్కల బెడద ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అన్ని సమస్యలను త్వరి తగతిన పరిష్కారం అయ్యేందుకు అధికారులను అదేశిస్తు న్నట్టు చెప్పారు. అనంతరం కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వంటేరు నర్సింహారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆంజనేయులతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కార్పొరేటర్లు, కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య సభ్యులు, తదితరులు హాజరయ్యారు.