Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ పనుల పరిశీలన
నవతెలంగాణ-చందానగర్
నాల విస్తరణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సత్యనారాయణ ఎంక్లేవ్ కాలనీలో రూ.172.25 లక్షల అంచనా వ్యాయామంతో నాలా పనులను పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని అసంపూర్తిగా మిగిలిపోయి న నాల విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా నాలలకు రక్షణ చర్యలలో భాగంగా ఫెన్సింగ్ వేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెండింగ్ పనులలో ఎటువంటి జాప్యం లేకుం డా సకాలంలో పనులు పూర్తి చేయాలనీ చెప్పారు. గత వర్షాకాలంలో నాలా పొంగి ప్రవహించడం ద్వారా ఇండ్లలోకి నీరు ప్రవహించి, పరిసరాలు నీటమునిగిన పరిస్థితి విధి తమే అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్లీ పునరావృతం కాకుండా పనులు చేపట్టామని, నాలాలో పేరుకుపోయిన చెత్త, మట్టిని పూడిక తీత ద్వారా తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా ప్రజలకు ఎటువంటి ఇబ్బం ది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అదిల్పటేల్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.