Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
ఈ నెల 15న పరిగి పట్టణంలో భీమ్ దీక్ష ప్రారం భసభ గోడపత్రికను స్వేరో ఇంటర్నేషనల్ రాష్ట్ర ఉపా ధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంచన్ పల్లి శ్రీనివాస్, స్వేరో జిల్లా అధికార ప్రతినిధి ఎరన్ పల్లి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజులు ఆవిష్కరించారు. కొడం గల్, రావులపల్లి, దౌల్తాబాద్, బోంరాస్పేట్ మండలాల్లో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ఉద్దేశంతో పుస్తక పఠనం, శారీరకంగా, మానసికంగా తమను తాము ఉద్ధ రించుకోవడం సమాజానికి సమయం, జ్ఞానం, అందిస్తూ ముందుకు నడుస్తుందన్నారు. సమాజంలో మాన్యవార్ కా న్సిరాం జయంతి నుండి అంబేద్కర్ జయంతి వరకు జరిగే ఈ పవిత్ర మాసంలో అందరూ సమ సమాజ నిర్మాణం కో సం జ్ఞాన నిర్మాణంలో భాగ్యస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో స్వేరో జిల్లా కార్యదర్శి బుచ్చయ్య, స్వైరో సర్కిల్ కొడంగల్ డివిజన్ అధ్యక్షులు కుప్పగిరి సా యిలు, పరిగి అధ్యక్షులు అనంతయ్య, తెలంగాణ ఉద్యమ కారులు మైలారం శ్రీనివాస్, విద్యార్థి విభాగం జిల్లా ఉపా ధ్యక్షులు ముకుంద, రావులపల్లి అంబేద్కర్ సంఘం అధ్య క్షులు హనుమంతు, కళాకారులు కొత్తూరు బాలరాం తది తరులు పాల్గొన్నారు.