Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్ బి.బ్లాక్ కాలనీలో రూ.50 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్ధరాత్రి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరి శీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోకజ కర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దు తానని పేర్కొన్నారు. కొండా పూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రేమ్‌నగర్ బి.బ్లాక్ కాలనీలో సీసీరోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిం చుకోవడం సంతోషకరమన్నారు. ప్రేమ్‌నగర్ బి.బ్లాక్కా లనీ దశ దిశను మార్చామని, ప్రేమ్‌నగర్ బి.బ్లాక్ కాలనీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశా మన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు అది ల్పటేల్, శ్రీనివాస్ చౌదరీ, తిరుపతి, రజినీకాంత్, ఇమా మ్, ఈరమ్మ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.