Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ శాఖల్లో రాణిస్తున్న కత్తిరెడ్డి అరుణ
- సెంట్రల్ రిజర్వ్ పోలీసు శాఖలో వివిధ రాష్ట్రాల్లో విధులు
- ప్రస్తుతం ఎస్ఓటీ శాఖలో పనిచేస్తున్న అరుణ
- పలుమార్లు రాచకొండ కమిషనర్‌తో రివార్డ్ అందుకున్న అరుణ
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని చిన్న తుండ్ల గ్రామానికి చెందిన కత్తిరెడ్డి అరుణ, రాజశేఖర్ రెడ్డి భార్యాభర్తలు. 1994 సంవత్సరంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌శాఖలో కాని స్టేబుల్‌గా ఎంపిక అయ్యింది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్, గుజరాత్, జమ్ము కాశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో 2017 వరకు విధులు నిర్వర్తించింది. దాదాపు 24 సంవత్సరాల పాటు సిఆర్‌పిఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పని చేసింది. ఆ తర్వాత పదోన్నతి ద్వారా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. దాదాపు రాచకొండ కమి షనర్‌తో రివార్డ్ కూడా అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను పని చేయడానికి 'నా భర్త ప్రోత్స వమే నాకు కొండంత బలం నింపింది'అని తెలిపారు. మ హిళలంతా సమాజంలో అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ఆమె ఒక దిక్సూచిగా నిలిచింది.