Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి బస్టాండ్‌లో ఒక వ్యక్తి నుంచి ఆరు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.ఈ ఘటన శంక ర్పల్లి బస్టాండ్‌లో చోటు చేసుకుంది. శంకర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా, మనూర్ మండలంలోని సక్రునాయక్ తండాకు చెందిన రాథోడ్ శంకర్ సోమవారం మధ్యాహ్నం శంకర్పల్లి బస్టాండ్‌లో దిగాడు. బస్సు కోసం బస్టాండ్‌లో వేచి ఉండగా అనుమా నాస్పదంగా పోలీసులకు కనిపించాడు. వెంటనే పోలీసులు అతని బ్యాగును తనిఖీ చేయగా, గంజాయి దొరికింది. వెంటనే బస్టాండ్‌లో తూకం వేయగా 6 కిలోలు ఉన్నట్టు తేలింది. 2004 సంవత్సరంలో నారాయణపేట నుంచి గంజాయి తీసుకుని పూణే మహారాష్ట్ర వెళ్లగా అక్కడ పోలీసులు శంకర్‌ను అరెస్టు చేసి ఎర్వాడ పూణే జైలుకు పంపారు. దీంతో ఆయనకు సుమారు మూడేండ్లు జైలు శిక్ష అనుభవించొ 2007లో బయటకు వచ్చాడు. శంకర్ సుమారుగా 15 రోజుల క్రితం జమ్మిగి, కర్ణాటకకు చెంది న బబ్లు అనే వ్యక్తి శంకర్వాళ్ళ తండా ధాబాలో తింటుం డగా పరిచయం ఏర్పడింది. బబ్లు శంకర్‌కు వైజాగ్ నుంచి గంజాయి తక్కువ ధరకు తీసుకొచ్చి హైదరాబాదులోని పరిసర ప్రాంతంలోఎక్కువ ధరకు అమ్ముకోవచ్చని శంకర్, బబ్లుకు చెప్పడంతో గతంలో చేసిన గంజాయి అమ్మడానికి వెళ్లి పట్టుబడ్డనని, జైలుకు కూడా వెళ్లి వచ్చానని శంకర్ చెప్పాడు. నేను వైజాగ్ నుంచి తీసుకొచ్చి, ఇక్కడ ప్రాంతం లోని అమ్మి పెట్టాలని డబ్బులు బాగా మిగులుతాయని బ బ్లు తెలిపాడు.దీంతో ఒప్పుకున్న బబ్లు రెండు కిలోలు ఉన్న, మూడు గంజాయి ప్యాకెట్లను తీసుకుని శంకర్పల్లి బస్టాండ్‌లో ఉండు అక్కడికి ఒకరు వస్తారనీ చెప్పాడు. ఒక్కో ప్యాకెట్‌కు రూ. 25000 చొప్పున, మూడు ప్యాకె ట్లకు కలిపి 75000 వస్తాయని , అందులో నీకు 15000 ఇస్తానని చెప్పాడు. నేను గంజాయి ప్యాకెట్లు తీసుకుని శంకర్‌పల్లిలో దిగగానే అక్కడ పోలీసులను చూసి పారిపో వడానికి ప్రయత్నించగా ఎస్సై కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మహేందర్, కానిస్టేబుళ్లు రామీనాయుడు, ధర్మారెడ్డి, శ్రీరాములు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్ప గించారు. సీఐ మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు ఎస్సై సం తోష్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.