Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
మండలంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధి, ఏకాశిలాపర్వతం (గిరి )చుట్టూ మంగళవారం సాయంత్రం గిరి ప్రదక్షిణ కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం స్థానిక నాయకులు, అధికారులు, యువత, పలుగ్రా మాల్లోని ప్రజలు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ప్రజ లు, సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. ప్రదక్షిణ అనే మాటకు వ్యాఖ్యానమిది. 'ప్ర' అంటే సకల పాపాల నిర్మూలనబీ 'ద' అంటే సకలైశ్వర్య ప్రదానం. 'క్షి' అంటే పునర్జన్మల నాశనంబీ 'ణ' అంటే జ్ఞానమోక్ష ప్రసాదం.''అని తెలిపారు. స్వామి సన్నిధిలో భక్తులకు అధ్యాతిక విషయాల పై పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.