Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నంలో ఘనంగా మహిళా దినోత్సవం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కార్మిక ఉద్యమాల ఫలితంగానే మహిళా దినోత్సవం ఏర్పడిందని ఐద్వా జిల్లా అధ్యక్షులు విజయమ్మ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీ య మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చిందన్నారు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మ హిళలు ప్రదర్శన చేశారని గుర్తు చేశారు. మహిళల డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించిందనీ తెలిపారు. దీంతో తొలిసారి 1911లో జర్మనీ, స్విజర్లాండ్ దేశాలలో మహి ళా దినోత్సవాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి సం వత్సరం మహిళ అంతర్జాతీయ దినోత్సవాన్ని అన్ని దేశాలతో పాటు భారతదేశంలోనూ జరుపుకుంటున్నామని చెప్పారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కు కల్పించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను పట్టించుకోవడం లేదన్నారు. ఒకవైపు మహిళలు నిర్బంధానికి గురవుతున్నారాని, మరొకవైపు ఎదిరించిన మహిళలపై అనేక రకాల రూపంలో దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దోపిడీ లేని సమానత్వ సమాజం కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సామెల్, శ్రామిక మహిళ నాయకురాలు యలమోని స్వప్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు చరణ్, సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ చింత పట్ల ఎల్లేశ, మండల కన్వీనర్ బుగ్గరాములు, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు తరంగ్, మహిళా సంఘం మండ ల నాయకురాలు శఫి, ఉన్నిస్సా బేగం, మహి ళా నాయరాలు బాలమణి, ఇందిరా, మున్ని, ఎలీషామ్మ, శిరీష, సరిత, గిరి పాల్గొన్నారు.