Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
- ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
మహిళలకు ఆర్థిక సమానత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిష్కరణ, సాంకేతి కలో సాంకేతికతలో లింగ సమానత్వం అనే అంశంలో భా గంగా జరుపుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. మహి ళలపై పట్టణాలలో కంటే గ్రామాలలో అనుకోని హింసా త్మక సంఘటనలు జరుగుతున్నాయని, అటువంటి సంఘ టనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలకు విద్య ప్రాముఖ్యత గుర్తించి ప్రభు త్వం కూడా మహిళలకు విద్యా అవకాశాలు కల్పించింద న్నారు. కొన్ని రంగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కొనసాగుతుందని అన్నారు. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికా రిణి కేతావత్ లలిత కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించడం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మహి ళలందరూ భాగస్వామ్యం కావడం గర్వించదగ్గ విషయ మని కొనియాడారు. మహిళల్లో అభివృద్ధి ప్రతి ఇంటి నుండి మొదలైనప్పుడే సాధ్యమవుతుందని, ఒక మహిళ స్వతంత్రంగా జీవించాలనే భావన ఉండాలన్నారు. మహి ళలపై జరుగుతున్న అన్యాయాలను, అరికట్టాలని ఉద్దేశం తో వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణన్ ్ మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున స్వయం సంఘాలకు రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించినప్పుడే మహిళలు అభివృద్ధి చెందడా నికి అవకాశం ఉంటుందన్నారు. పలువురికి సన్మానంతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ అశోక్‌కుమార్, జిల్లా విద్యాధికారి రేణుక, భూగర్భ జిల్లా అధికారిణి దీపారెడ్డి, డీఆర్డీఏ అడిషనల్ పీడీ, పీడీ మెప్మా, మహిళా శిశు సంక్షేమ సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కృష్ణవేణి, జయరాం, రేణుక, కాంతారావు, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి , సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నార.