Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా నోడల్ అధికారులను ఆదేశించిన కలెక్టర్ హరీష్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికలను ఈ నెల 13న జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ హరీష్ సూచించారు. బుధవారం సమీకృత నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరీష్ ఎన్నికలపై నోడల్ అధికారులు ఆర్డీఓలు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం లో బ్యాలెట్ బాక్సులను ఉపయోగించే విషయమై సమీక్షిం చారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. జిల్లాలో 9,186 మంది ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఓటు హక్కును పొందినట్టు వెల్లడించారు. ఇందులో పురుషులు 4,870 మంది 4,315 మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నట్టు వివరించారు. వారంతా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రిసైడింగ్, సహయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, తిరుపతి రావు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, నోడల్ అధికా రులు, ఆర్డీఓలు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -