Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఏజెన్సీ సంస్థలతో ప్రతిపక్షాల గొంతునొక్కుతుంది
- జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్షను భగం చేయడమే కేంద్రం లక్ష్యం
- ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్ఎస్ ఎదుగుదల చూసి తట్టుకులేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీ సంస్థలతో దాడులు చేస్తోం దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల నాయకుల గొంతు నొక్కే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం పాల్పడటం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఆమె ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవి తకు ఈడీ నోటీసుల జారీపై బుధవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పందించారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిం చేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమైన నేప థ్యంలో ఆయనను ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం శోచనీయమ న్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ఎదుగుదలను అడ్డుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నా లు ఫలించవన్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు కో రుతూ ఈ నెల 10వ తేదీన డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు చేస్తోం దన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేశారని మంత్రి ఆరోపించారు.