Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ భూముల పరిరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రామన్న
మండల తహసీల్దార్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
భూ కబ్జా దారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవా లని మండల తహసీల్దార్‌కు ప్రభుత్వ భూముల పరి రక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రామన్న ఫిర్యాదు చేశారు. దోమ మండల రెవిన్యూ పరిధిలో వివిధ గ్రామా ల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు మండల ప్రజా పరిషత్‌కు సంబంధించిన కుటుబ సభ్యులండతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ప్రభుత్వ భూములు, చెరు వు శిఖం, నీటి కాలువలు,అడవి భూములు, గ్రామకంఠం భూములు రోడ్‌కు అనుకుని ఉన్న వివిధ భూములను కబ్జా చేస్తున్నారు. ఈ కబ్జా దారులకు కొందరు రెవిన్యూ అధికా రులు కూడా మద్దతు ఉందని తమ దష్టికి వచ్చిందన్నారు. మండల మేజిస్ట్రేట్ తమరు ఇలాంటి సమస్యలను పరిష్క రించాలని రామన్న కోరారు. నిరుపేద ప్రజలకు గత ప్రభు త్వాలు బతుకు దెరువుకు వివిధ ప్రభుత్వ భూములను సా గు చేసుకోవచ్చని ఇచ్చారు. అలాంటి భూములు ఈ రోజు ధరణి వచ్చిన తరువాత చాల మంది పేదలకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. దోమ రెవిన్యూ కార్యాలయం చుట్టూ, దో మ పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రజల తిరిగి తిరిగి అలసిపో తున్నారని తెలిపారు. ప్రజల భూ సమస్యలను తక్షణమే పరిష్కరించక పోతే కుల సంఘాలను, ప్రజా సంఘాలను కలుపుకొనిపై అధికారులకు పిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాములు నాయక్, వెంకటేష్, బహుజన నాయకులూ పాల్గొన్నారు.