Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మెన్ శరత్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
దోమ మండలంలోని కేఎస్ఆర్ ట్రస్ట్ సేవలు మరింత కొనసాగిస్తూ, పరిగి ప్రాంత ప్రజలకు కూడా విస్తృతంగా అందజేస్తామని కెఎన్ఆర్ ట్రస్ట్ చైర్మెన్ శరత్‌కుమార్‌రెడ్డి అన్నారు.గురువారం మోత్కూర్ గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద రావు హాజరై, మాట్లాడుతూ కెఎస్ఆర్ ట్రస్ట్ సేవలు కొనసాగిస్తూ పరిగి ప్రాంత ప్రజలకు విస్తతంగా సేవలు అందించేందుకే బీజేపీలో చేరినట్టు తెలిపారు. అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ కేటాయించిన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, స్థానిక సర్పంచ్ కేశవులు, జిల్లా నాయకులు గణపురం వెంకటయ్య గౌడ్, మేకల యాదయ్య, ఆయా మండలాధ్యక్షులు రామ్ రెడ్డి,పెంటయ్య, కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థకురాలు రాజేశ్వరమ్మ, ఉపసర్పంచ్ శ్రీకాంత్ రావు, మాహిపాల్, నర్సింలు, నాయకులు పాల్గొన్నారు.