Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
సీఎం సహాయనిధి నిరుపేదలకు భరోసానిస్తుందని ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి లింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఈ మేరకు ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ.22 వేలు చెక్కను వైస్ ఎంపీపీ జక్కుఅనంత్ రెడ్డికి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎగిరిశెట్టి సత్యం, ఆమనగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షులు నేనావత్ పత్యనాయక్, సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి, రమేష్ నాయక్, మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.