Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతలెంగాణ-మొయినాబాద్
ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని టీఎస్‌యూటీఎఫ్ మండలా ధ్యక్షులు బీమారెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్సింగి, షేక్‌పేట్, గౌల్ దొడ్డి, శంకర్పల్లి, చేవెళ్ల, బంట్వరం రెసిడెన్షల్ స్కూల్స్, రెసిడెషల్ డిగ్రీ కాలేజీ వికారాబాద్లను సందర్శించి పాపన్నగారి మాణిక్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహ, రాష్ట్ర కమిటీ సభ్యులు, రిటైర్డ్ ఎల్ఎఫ్ ఎల్‌హెచ్‌ఎం టెలిశ్వరయ్య, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎల్లయ్య ఆసిఫాబాద్, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్రకమిటీ సభ్యులు రాజు, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, మండల కార్యదర్శి శివరాజ్, శంషాబాద్ మండల అధ్యక్షులు సురేష్ ఆయా పాఠశాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.