Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలు భద్రపరిచేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూం ను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)లో రెండు పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో కలెక్టర్ సి. నారాయణ రెడ్డి గురువారం పరి శీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారుల ఏర్పా ట్లపై పలు సూచనలు జారీ చేశారు. బ్యాలెట్ బాక్స్‌లపై బాక్స్ నెంబరు, పోలింగ్ కేంద్రాల్లో నెంబర్లు స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్లు వేయాలన్నారు.ఈ పోలింగ్ నిర్వహణ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను నేరుగా సరూర్‌నగర్‌కు తరలించాలని సూచించారు. ఆ పోలింగ్ కేంద్రాలకు తలుపులు, కిటికీలు మరమ్మతులు ఉంటే వెంటనే చేసట్టి, విద్యుత్తు, ఫ్యాన్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని తహసీల్దార్‌కు ఆదేశించారు. 13 తేదీన జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు, రేపటి వరకు పూర్తి చేసుకోవాలాని తెలిపారు.
జడ్పీహెచ్ఎస్ (బాలురు) ఆకస్మిక తనిఖీ
అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజన స్టాక్ రిజిస్టర్, పాఠశాల అభివృద్ధికి మంజూరైన నిధుల రిజిస్టర్, బిల్లులను కలెక్టర్ తనిఖీ చేశారు. కొంతమంది ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనానికి వెళ్లి ఆలస్యంగా రావడం పట్ల, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవులపై వెళ్లిన ఉపాధ్యాయులు సెలవు దరఖాస్తులు పరిశీలించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో పొంతన లేకపోవడంపై పాఠశాల హెడ్మాస్టర్ ను ఆరా తీశారు. పాఠశాలలో మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, మధ్యాహ్న భోజనం వివరాలు సరిగా లేక పోవడం వల్ల పాఠశాల హెడ్మాస్టర్ శ్రీహరిని బదిలీ చేస్తు న్నట్లు ఆదేశించారు. పాఠశాలకు తిరిగి వస్తానని, తప్పని సరిగా మార్పు కనిపించాలని లేకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి, వికారాబాద్ తహసీల్దార్ వహీద ఖాతూన్, ఎలక్షన్ డి.టీ. రవీందర్ దత్తు తదితరులు పాల్గొన్నారు.