Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్‌నగర్
ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వెల్జర్ల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులై విద్యను బోధించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శైలజ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి కష్ట పడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఎవరైతే చదువుపై శ్రద్ధ వహించి విద్యను అభ్యసిస్తారో వారు ఎప్పుడైనా అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మెన్ కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయులు శైలజ, ఉపాధ్యాయులు గీత, రవీంద్ర నాథ్,ప్రహ్లాద రావు, శివాజీ, వేణు, వెంకటేష్, సామ్రాజ్యం , తదితరులు పాల్గొన్నారు.