Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ అశోక్‌కు గ్రామస్తుల వినతి
నవతెలంగాణ-మొయినాబాద్
మండల కేంద్రంలోని చిన్న మంగళారం గ్రామ సర్పంచ్ గడ్డమీది సుఖన్య హరిశంకర్ గౌడ్, తన కుమారుడు విష్ణుగౌడ్ గ్రామంలోని చెరువు కింది భూముల్లో కొంతకాలంగా మట్టితవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. ప్రజలకు సేవ అందిస్తానని గెలుపొందిన సర్పంచ్, వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ భూముల్లోని మట్టిని తవ్వి, తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూన్నారు. శుక్రవారం మట్టి తవ్వడం ఆపాలని గ్రామస్తులు తహసీల్దార్ అశోక్‌కు వినతిపతం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ తన బాధ్యతను ,విధులను మరిచి సర్పంచ్ అనే హౌదాతో అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్లో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. తనను ఆపే వారే లేరు అన్నట్టుగా సర్పంచ్ వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా సంబధిత అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాను ఆపాలని గ్రామస్తులు తహసీల్దార్ అశోక్‌ను కోరారు. దీంతో తహసీల్దార్ స్పందించి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లోని మట్టిని తవ్వి, అక్రమంగా తరలిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.