Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ మాడుగుల మండల కార్యదర్శి కురుమిద్ద శివ
నవతెలంగాణ-మాడ్గుల
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీస అవసరాలు తీర్చని ప్రభుత్వం దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్వన్, బంగారు తెలంగాణ వెలిగిపోతుందని గొప్పలు చెబుకోవడం విడ్డూరంగా విడ్డూరంగా ఉందనీ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కురిమిద్య శివ విమర్శించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని కలకొండ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, నెలకొన్న సమస్యలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ప్రధానంగా మరుగుదొడ్లు సమస్య తీవ్రంగా ఉందనీ, దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాడి ఎనిమిదేండ్లు గడుస్తున్నా,ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు.కలకొండ పాఠశాలలో సుమారు150 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారనీ,వారికి కనీసం ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించకపోవడం దారుణ మన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే మండ లంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎంఈఓ సర్దార్నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు శివ, సహాయ కార్యదర్శి జగన్ తదరులు పాల్గొన్నారు.