Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రఘునందన్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే పదోన్నతులు, బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రఘునందన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా పరిషత్ శంకర్పల్లి బాలుర, బాలికల పాఠశాల, జిల్లా పరిషత్. కొండకల్, జిల్లా పరిషత్ జన్వాడ, జిల్లా పరిషత్ మహారాజ్ పేట్, జిల్లా పరిషత్ టంగటూర్, పరిషత్ ప్రోద్దటూర్, శంకర్పల్లి ఆదర్శ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిదేండ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, ఐదేండ్లుగా బదిలీలు కూడా లేవని తద్వారా విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని పదోన్నతుల ప్రక్రియను పున్ణ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదర్శ పాఠశాలల, కేజీబీవీ ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ ప్రకటించి, పండిత, పీఈటీ పోస్టులకు కూడా ఈ షెడ్యూల్లోనే పదోన్నతులు కల్పించాలన్నారు. 317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేసి, సీపీఎస్‌ను రద్దు చేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమ సమయంలో సమైక్యవాదాన్ని వీడి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. తమ సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దేవన్నగారి మల్లారెడ్డి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని వారికి మొదటి ప్రాధాన్యతో ఓటేసీ గెలిపించాలని ఉపాధ్యా యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.మునీర్ పాషా, శంకర్పల్లి మండలాధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్, శ్రీనివాస్‌చారి, గౌరవాధ్యక్షులు దేవేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, ఉపాధ్యా యులు తదితరులు పాల్గొన్నారు.