Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
గ్రామాల్లో ఉన్న నర్సరీల ద్వారా మరిన్ని మొక్కలను పెంచాలని ఎంపీడీవో విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం యాచారం మండల పరిధిలో గడ్డమల్లయ్యగూడలో నర్సరీ కింద పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. అనంతరం పంచాయతీ రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో నర్సరీల పెంపకం, కంపోస్ట్ యాడ్లు, ఆఫీసులో రికార్డుల పని విధా నాన్ని పరిశీలించామన్నారు. ఖాళీ ప్రదేశాల్లో నర్సరీలో కింద పెంచుతున్న మొక్కలను నాటి, హరితహారాన్ని పెంపొం దించాలని చెప్పారు. పంచాయతీ రికార్డులను ఎప్పటి కప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా డ్రయినేజీల పరిశుభ్రత, వీధిలైట్ల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ అచ్చన జంగయ్య, టెక్నికల్ ఇంజనీర్ శివశంకర్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ, పాల్గొన్నారు.