Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృత్తి సంఘాల నాయకులు పగడాల యాదయ్య
నవతెలంగాణ-మంచాల
ఈ నెల 17న మండలంలో జరిగే జీపు జాతను జయప్రదం చేయాలని వృత్తి సంఘాల నాయకులు పగడాల యాదయ్య కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని కృష్ణమూర్తి భవనంలో ప్రజా సంఘాల నాయకులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న మంచాల మండలం లోని పలు గ్రామాల్లో ప్రజా జీపుజాత నిర్వహిస్తామన్నారు. ప్రజా సంఘాల నాయకులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జీపుజాతాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగిల్ల శ్యామ్సుందర్, రైతు సంఘం మండల కార్యదర్శి రావుల జంగయ్య, సీఐటీయూ మండల కన్వీనర్ పొచమోనీ కృష్ణ, తదితరులు ఉన్నారు.