Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
పరిగి మండలం నారాయణపూర్ గ్రామంలోని రేణు కా ఎల్లమ్మ తల్లి ఆలయం 20వ వార్షికోత్సవంలో భాగంగాలో ఆదివారం దేవీ కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సంఘం వికారాబా ద్ జిల్లా కన్వీనర్ వడ్ల పాండురంగం చారి ఆధ్వర్యంలో మూడవరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివా సచారి సుహాసిన, అనిల్‌చారి అన్నపూర్ణ దంపతులు రేణుక ఎల్లమ్మ కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయం త్రం పల్లకి సేవ నిర్వహించారు. కళాకారులతో హరిచంద్ర వీధి నాటకం ఏర్పాటు చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న
సర్పంచ్ ఝాన్సీ బందయ్యా
రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహౌత్సవంలో నారాయణ పూర్ సర్పంచ్ ఝాన్సీ బందయ్య పాల్గొ న్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్ల జగదీశ్ చారి, శారద, లక్ష్మమ్మ, నాయకులు ఎంపీపీ కరణం అరవింద్ రావ్, జడ్పీటీసీ హరిప్రియప్రవీణ్రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆంజనేయులు, వెంకట్రాంరెడ్డి, వెంకటయ్య, నల్కజగన్, బందెయ్య, రవి, జగదీశ్వరాచారి, మాణిక్యం, బిచ్చయ్య, నా రాయణ, వెంకటయ్య, సత్యనారాయణరెడ్డి, జంగారెడ్డి, వడ్ల నర్సింహులు, ఆసీప్బీ ఇదాయిత్ అలీ, రాంచం ద్రయ్య, మౌనేష్ చారి, తదితరులు పాల్గొన్నారు.