Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం
- ఇబ్రాహీం పట్నం మార్కెట్ కమిటీ డైరక్టర్ ఎండి జానీ పాషా
నవతెలంగాణ-మంచాల
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న ప్రగతి నివేదన యాత్ర బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నింపిందని ఇబ్రాహీంపట్నం మార్కెట్ కమిటీ డైరక్టర్ ఎండి జానీ పాషా అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ జనవరి 22న యాచారం మండలం నంది వనపర్తి గ్రామంలో ప్రారంభమైన ప్రగతి నివేదన యాత్ర ఇబ్రాహీంపట్నం నియోజక వర్గంలో 4 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 83 గ్రామాలు 636 కిలోమీటర్లు తిరిగిందని అన్నారు. జ్వరం వచ్చిన, కాలికి గాయం అయినా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకో వడం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకా రంతో సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం సంతో షకరం అన్నారు. పాదయా త్రతో బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సహం నిండిందన్నారు. ఈ సందర్భంగా కేకట్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం పట్నం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కంబా లపల్లి భరత్‌కుమార్, బంటి యూత్ ఫోర్స్ సభ్యులు మొగుల్ల వినరురెడ్డి, నిట్టు జగదీష్, మొగుల్ల జీవన్‌రెడ్డి, బొట్టు ప్రవీణ్‌నాయక్, సురేష్, నిఖిల్‌గౌడ్, కరుణాకర్, తదితరులు ఉన్నారు.