Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గం కోఆర్డినేటర్ న్యాయవాది యాదిలాల్
- ఆమనగల్లో టీడీపీ కార్యాలయం ప్రారంభం
- పెద్దసంఖ్యలో హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు
నవతెలంగాణ-ఆమనగల్
టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న టీడీపీ సభత్వనమోదు కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని తెలుగుదేశం పార్టీ కల్వకుర్తి నియోజకవర్గం కో ఆర్డినేటర్ న్యాయవాది అండేకార్ యాదిలాల్ పిలుపు ని చ్చారు. ఆమనగల్ పట్టణంలో ఆదివారం టీడీపీ కార్యాల యాన్ని సీనియర్ నాయకులతో కలిసి యాదిలాల్ ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల్లో భాగం గా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీ శ్రేణులు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంతో పాటు పార్టీ సభత్వనమోదును యజ్ఞంలా చేపట్టాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్తా ఓ సైనికుడిలా కష్టపడి పనిచేయా లని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆమనగల్, కడ్తా ల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలతో పాటు ఆయా గ్రామాలకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కాలే మల్లయ్య, అర్థం నర్సింహులు, కండె సత్యం, కండె భాస్క ర్, పంచాక్షరి, శ్రీనాథ్, గాజుల పద్మనాభం, ఎం.డి.బాబా, పెంటయ్య, హేమ్లా నాయక్, వెంకటేష్, నరసింహ, మ హేందర్, పాండు నాయక్, శీలం వెంకటయ్య, వేణు మూ ర్తి, జగన్, సత్తయ్య, సతీష్, తిమ్మయ్య, ఆనంద్, టీఎన్ఎస్ ఎఫ్ నాయకులు శ్రీధర్, గుండ్రాతి కుమార్ గౌడ్, నరేష్ యాదవ్, శివ, శేఖర్ యాదవ్, వెంకటేష్‌గౌడ్, మణికంఠ, అనిల్ గౌడ్, సురేష్, పరమేష్, శివచారి తదితరులున్నారు.