Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తూరులో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నవతెలంగాణ-కొత్తూరు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం కొత్తూరు బీఆర్ఎస్ మండల కొ త్తూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్య క్రమంలో ముఖ్యఅతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నాయ కులు ఎమ్మె సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ బాతు క లావణ్య దేవేందర్ యాదవ్‌లు హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పాత జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి బండి సంజరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనం తరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి స్థానిక కొత్తూరు పోలీస్ స్టేషన్లో బండిసంజరుపై కేసు నమోదు చేయా లని ఫిర్యాదు అందజేశారు. వారు మాట్లాడుతూ... మహి ళా దినోత్సవం రోజున ప్రపంచమంతా మహిళలందరిని గౌ రవించుకుంటుంటే ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి అసభ్య కరంగా మాట్లాడిన బీజేజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ రును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జాతీ య పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడై ఉండి మహిళలను గౌరవిం చాలన్న సోయి లేకుండా పోయిందన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా బండి వ్యాఖ్యలు ఉన్నా యని, అతని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలన్నారు. పిచ్చెక్కి పశువుల ప్రవర్తిస్తున్న అతనిని వెంటనే పిచ్చి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని సూచించారు. దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మహిళల పట్ల అసభ్యకరం గా మాట్లాడడం కాదు పార్లమెంట్లో మహిళల బిల్లు పెట్టి అమలు చేయించాలన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీలో భయం పట్టుకుందని భయంతో వారు మతిభ్ర మించి పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు. చట్టసభల్లో మహిళలకు తగిన రిజర్వేషన్ కల్పించాలని జంతర్ మంత ర్ దగ్గర ధర్నా చేస్తూనే తనపై వచ్చిన ఆరోపణలు ఏమా త్రం వాస్తవం కాదనీ నిరూపించుకోవడానికి ఆమె ధైర్యం గా ఈడీ ఆఫీసుకు అధికారుల ముందు హాజరైందని తెలి పారు. కార్యక్రమంలో కొత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాతుక దేవేందర్ యాదవ్, పెంటనోళ్ల యాదగిరి, లింగంనాయక్, మక్తగూడ సర్పంచ్ కాట్నరాజు, మల్లాపూర్ సర్పంచ్ సాయి లు, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేందర్‌గౌడ్, కొడిచర్ల ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, బ్యాగరి యాదయ్య, చేగుర్ పీఎసీఎస్ వైస్‌చైర్మన్ మున్నూరు పద్మారావు, బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షులు కడల శ్రీశైలం, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, కమ్మరి జనార్దన్‌చారి, బీఆర్ఎస్ ఎస్సిసెల్ మండలాధ్య క్షులు దేశాల జైపాల్, బీఆర్ఎస్ మాజీ మండల ఎస్టీసెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, గోపాల్ నాయక్, దెయ్యాల పాండు, జోగు బాలరాజు, బి.రాజు, దేశాల భీమయ్య, ఏలగని రాములుగౌడ్, ఎమ్మె అజరు, కర్రోళ్ల లక్ష్మయ్య, సిటీ టేబుల్ వెంకటేష్, ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.