Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యం
సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య
నవతెలంగాణ-తలకొండపల్లి
మండలం గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతామని సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రా మంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ సహకారంతో ఎన్ ఆర్ ఈఈజీఎస్ నిధుల నుండి భాగంగా ఏపూరి చంద్ర య్య ఇంటి నుండి ఊరుకొండ అంజయ్య ఇంటి వరకు రూ.5 లక్షలతో మంజూరైన సీసీరోడ్డు పనులను శంకు స్థాపన చేసిన సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య ప్రారంభిం చారు. సర్పంచ్ మాట్లాడుతూ విడతల వారీగా గ్రామం లోని అన్ని కాలనీలలో సీసీరోడ్లు నిర్మించనున్నట్లు తెలి పారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామా భివృద్ధిలో గ్రామస్తులంతా భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలను ఎమ్మెల్యే జైపాల్ యాద వ్ సహకారంతో అన్నిరంగాల్లో అభివృద్ధి పరంగా ముందు వెళుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పెంటమ్మ కు మారుడు రామస్వామి, మాజీ ఎంపీటీసీ భగవాన్‌రెడ్డి, వార్డుమెంబర్ శ్రీనయ్య, మాజీ వార్డు మెంబర్ కాలే శేఖర్, స్కూల్ వైస్ చైర్మన్ మల్లయ్య, కృష్ణారెడ్డి, బాల్ జంగయ్య, మల్లేష్, కృష్ణయ్య, శ్యాంసుందర్, శేఖర్‌గౌడ్, ప్రసాద్, శ్రీశై లం, వెంకటయ్య, లక్ష్మయ్య, బాలయ్య, జగన్, ధనంజి, రామస్వామి, కిరణ్, నాగయ్య, బాలయ్య పాల్గొన్నారు.