Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్‌నగర్
కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లేం దుకు పలువురు నాయకులు అన్నారు. కాంగ్రెస్ 'హత్ సే హాత్ జోడో'యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్ చేసి న అభివద్ధిని అధికారంలోకి వస్తే చేయబోయే పనులు గురించి ప్రజలకు వివరిస్తూ వారితో మమేకమవుతూ ముందుకెళ్తుందన్నారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని లింగారెడ్డి గూడ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మెహరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోడో యాత్రకు ముఖ్యఅతిథిగా టీపీసీసీ సభ్యులు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్ హాజరై యాత్రలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల ను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు. గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్లను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని కాంగ్రెస్ చేప ట్టిన యాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పం దన ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా స్వార్ధ రాజకీ యా లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తేనే రాష్ట్రంలోని దేశంలోని అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని రెండు కలిసి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నా యని ఒకరిపై ఒకరు బురద జల్లుకోవ డమే అని స్పష్టం చేశారు. కార్యక్రమంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వచ్చింది. కాంగ్రెస్ ఇలానే నిరంతరం ప్రజల సమ స్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని రానున్న ఎన్నికల్లో అధికా రంలోకి రావడం ఖాయమని నాయకులు అన్నారు. కార్య క్రమంలో మధు, శ్రీకాంత్, పవన్, నయబ్, అక్బర్, శేఖర్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.