Authorization
Tue April 15, 2025 09:27:28 am
నవతెలంగాణ-తలకొండపల్లి
మండలం వెంకటేశ్వర స్వామి బ్రహ్మౌత్సవాల సం దర్భంగా దేవునిపడకల్ గ్రామంలో ఆదివారం ఇండి యన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబి రాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రెడ్ క్రాస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షు డు ఎస్.నరసింహారెడ్డి, సర్పంచ్ శ్రీశైలం ఉపసర్పంచ్ తిరు పతి, శబ్దాప్తి టౌన్షిప్ ఎండి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ రాజ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేష్, శెట్టి, డియర్ రాజ్ కుమార్, సర్పంచ్ శ్రీశైలం, ఉపసర్పంచ్ తిరుపతి, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు శంక ర్, పడకల్ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, గ్రామ పెద్దలు, అర్చకులు పరవస్తూ గోపాలచార్యులు, రామచార్యులు, శ్రీవాసచార్యులు, కన్నఅయ్యగారు, వివిధ గ్రామాల సర్పం చులు ఉపసర్పంచులు యూత్‌సభ్యులు తదితరులు పాల్గొన్నారు.