Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ జిల్లా కోశాధికారి డాక్టర్ జగన్నాథ్
- మండలశాఖ సమావేశం
- మొత్తం 87 మంది ఓటర్లు
నవతెలంగాణ-యాచారం
అర్హులైన ఉపాధ్యాయులందరూ హైదరాబాద్, రం గారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఓటు హ క్కును సద్వినియోగం చేసుకోవాలని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి డాక్టర్ జగన్నాథ్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో యూటీఎఫ్ మండల శాఖ సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవా రం ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవు తుందని, ఈ సమయాన్ని ఉపాధ్యాయులంతా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. యాచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మండలంలో ఉన్న మొత్తం 87 మంది ఉపా ధ్యాయులు ఓటు హక్కును సకాలంలో ఉపయోగించు కోవాలని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు సల్వాల నరసింహ, పి అంజయ్య, మండల శాఖ ఉపాధ్యక్షుడు ధనరాజ్, జిల్లా వివోటీటీ కన్వీనర్ మండల వెంకటేష్, కోశాధికారి జంగయ్య, జిల్లా కౌన్సిలర్ మోతిలాల్, మల్లేష్, శ్రీనివాస్ నాయక్, ఆంజనే యులు, మండల శాఖ కార్యదర్శి మోహన్, జగదీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.